అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. 14.29 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ప్రభుత్వంపై రూ. 4వేల కోట్ల అధనపుభారం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మంగళవారం ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మధ్య చర్చల సందర్భంగా కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అయితే ఆ లెక్కలు తప్పని ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీవో ఉద్యోగసంఘాల నేతలు అన్నారు. అసలు లెక్కలు తాము చెపుతామన్నారు. దీనికి సంబంధించి బుధవారం సజ్జలను కలిసి వాస్తవ లెక్కల వివరాలు అందిస్తామన్నారు. 9మందితో కూడిన స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో సజ్జలకు లేఖ అందించనున్నట్లు ఉద్యోగసంఘాల ప్రతినిధులు తెలిపారు.