Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగ సంఘాలకు ముచ్చటగా మూడోసారి మొండిచేయి

అమరావతి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఉద్యోగ సంఘాలకు ముచ్చటగా మూడోసారి మొండిచూపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఉద్యోగులను  అధికారులు వెనక్కి పంపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిక ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పీఆర్సీపై తిరుపతిలో సీఎం జగన్ ప్రకటన చేశారని అధికారులు గుర్తుచేశారు. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని కార్యదర్శులు పేర్కొన్నారు.


పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తిరుపతిలో పర్యటిస్తున్న జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది. సరస్వతి నగర్‌లో సీఎంను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చానట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే పీఆర్సీని మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
Advertisement