Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఎందుకు ఏడ్వను.. బాధ ఉంటుంది.. నేను రాయి కాదు కదా.. ఇంటికెళ్లి పడుకున్నపుడు..

twitter-iconwatsapp-iconfb-icon

ఆర్కే: ఫర్‌ సపోజ్‌ గెలిచినవాడు అర్హత ఉన్నాలేకపోయినా ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా..

ప్రకాశ్‌రాజ్‌: అలా అని నేను మారాల్సిన అవసరం లేదనుకున్నా.


ఆర్కే: అలాంటప్పుడు మీరు పర్సనల్‌గా తీసుకున్నారు కదా.. నాన్‌ లోకల్‌, లోకల్‌ అనీ. 

ప్రకాశ్‌రాజ్‌: అది తప్పు కదా? 


ఆర్కే: వాళ్లంటారు అది ఒక ఆయుధమని..

ప్రకాశ్‌రాజ్‌: ఫైట్‌కు రావద్దని చెప్పలేదు. రాంగ్‌ ఫైట్‌. మనిషి హర్ట్‌ అయ్యారా లేదా! 


ఆర్కే: మీరు హర్ట్‌ అయ్యారా ఇంతకీ..

ప్రకాశ్‌రాజ్‌: ఎందుకు అవ్వను? నేను మాత్రమే కాలేదు కదా. దీని వల్ల చాలా పాపులరయ్యాను. ఎలా రియాక్ట్‌ అయ్యానో చూశారు. వాళ్లు ఏడ్చారు. ఇండిపెండెంట్‌ ఆర్టిస్టుగా ఉండే నన్ను చూసి ఫీలయ్యారు. మా ఆఫీసుముందు ఒకాయన అనవసరంగా రొచ్చులో పడ్డారు కదా అన్నాడు.. ఔను అన్నాను. నా లైఫ్‌లో రొచ్చులో పడాల్సిన అవసరం ఉంది. చరిత్రలో మీరు చేసిన తప్పులను ప్రపంచం మర్చిపోతుందే కానీ మీ మౌనాన్ని క్షమించదు. నేను ఉండలేను సర్‌ అలా. మనసాక్షి ఒప్పుకోదు. 


ఆర్కే: తేడా వచ్చిందంటే మీకు సపోర్టు చేసిన చిరంజీవి, నాగబాబును కడిగేసే రకం. ఈ టెంపర్‌మెంట్‌తో అవకాశాలే రాకపోతే..

ప్రకాశ్‌రాజ్‌: భలేవాళ్లే సర్‌. ఇంతకంటే అవకాశాలు ఇస్తారా? 56 ఏళ్లు నాకు. పొలాలున్నాయి. అన్నీ ఉన్నాయి. ఇన్ని లాంగ్వేజ్‌లు. ఎవరు కాదనేస్తారు సర్‌? భయపెడతారా? మెంబర్స్‌ నుంచి బయటకు వచ్చా. ఆపి చూడండి. 


ఆర్కే: మీరు వర్సటైల్‌ యాక్టర్‌. హీరోల్లో సగం మందికి నటన సరిగా రాదు.. మీకు ఏమనిపిస్తుంది..

ప్రకాశ్‌రాజ్‌: నటన రాకపోవడం వేరు. కొందరికి డ్యాన్స్‌ ఉంటుంది. నేను బెటరా.. వాళ్లు బెటరా అనే డిష్కషన్స్‌కి రాను. నా క్యారెక్టర్‌ స్ర్టాంగ్‌గా ఉందని వాళ్లు ఎడిటింగ్‌లో కట్‌ చేశారు. వాడిని ఎలివేట్‌ చేయటానికి క్యారెక్టర్‌ అలానే చేస్తా. ఐ యామ్‌ ఎన్‌ ఆర్టిస్ట్‌. రియల్‌ లైఫ్‌లో ఎవరినీ డామినేట్‌ చేయలేదు.


ఆర్కే: పరిశ్రమ ఎటు మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు కదా!

ప్రకాశ్‌రాజ్‌: ఇప్పుడే మొదలైంది. ఎవడో ఒకడు పుడతాడు. వచ్చాను సర్‌. ఇది మరో చరిత్రనే. 


ఆర్కే: విష్ణు ప్యానల్‌ను జగన్‌ సపోర్టు చేశాడు.. బీజేపీ వాళ్లు కూడా మీకు వ్యతిరేకంగా చేశారు కదా.

ప్రకాశ్‌రాజ్‌: ఆయన ట్వీట్‌ చేశాడు.. ఏమీ లేదు అని. స్టేట్‌కి లీడర్‌ అయిన ఆయన ట్వీట్‌ చేయడమేంటి? ఈ రాజకీయ పార్టీలకు బ్రెయిన్‌ లేదు. అన్నిచోట్ల మనముండాలని అంటారు. అక్కడ కొడతారు. నొప్పి వేస్తుందంటే ఆనందం. నొప్పిలేదంటే సమస్య. ఎంతకొట్టినా నొప్పి లేదంటే.. అని బీజేపీ వాళ్లు టైర్డ్‌ అవుతున్నారు. వీడు అయిపోయింది అనుకుంటే.. ఇలా చేస్తున్నాడే అని అలసిపోతున్నారు. నాకు నచ్చిందీ గేమ్‌. వచ్చి ఏం చేశార్రా ఇక్కడ.. ఓడించగలిగారు. ఆపలేరు కదా నన్ను.


ఆర్కే: మీకు ఆస్తి ఉందా.. మీకు బిజినెస్‌లు లేవు కదా.. ఉంటే భయాన్నిస్తుంది.

ప్రకాశ్‌రాజ్‌: ఎలక్షన్ల సమయంలో నా ఆస్తులు బయటపెట్టా. నాకు ఫామ్‌ హౌస్‌ ఉంది. భూములు ఉన్నాయి. డబ్బు, భూమి కాదు.. నీకు ఎంత కావాలో నీకు తెలియాలి. ఇంక కొనను భూమి. ఎందుకంటే మెయింటేన్‌ చేయడానికి ఇది చాలు. ఫామ్స్‌లో డబ్బులు వస్తున్నాయి. ఇరవై కాటేజెస్‌, రెస్టారెంట్స్‌ రెండున్నాయి. యోగా చేసుకోవచ్చు. తినొచ్చు. ఆఫీషియల్‌. చాలా ప్రశాంతంగా ఉంటుంది. షాద్‌నగర్‌లో ఉంటుంది ఫామ్‌ హౌస్‌. చెట్లను చూడొచ్చు.. ఫ్రూట్స్‌ కోయచ్చు. ఇంట్లో వాళ్లకు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. నేను పర్సనల్‌ లైఫ్‌లో రిచ్‌గా ఉంటా. 


ఆర్కే: మీకెంత మంది పిల్లలు?

ప్రకాశ్‌రాజ్‌: ఒక బాబు పోయాడు అప్పుడు.  ముగ్గురు పిల్లలు ఇప్పుడు. పెద్ద కూతురు ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసింది. తనకిప్పుడు ఇరవై ఐదేళ్లు. రెండో కూతురు ఏ.ఆర్‌.రెహమాన్‌ అకాడమీలో చదువుతోంది. ఆమెకు కంపోజింగ్‌ ఇష్టం. ఇక నా రెండో భార్యకు పుట్టిన బాబుకి ఐదున్నర సంవత్సరాలు.


ఆర్కే: పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి...

ప్రకాశ్‌రాజ్‌: అది తన ఇష్టం. ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు. కార్డు తీసుకుని స్టార్ల ఇళ్లకు తిరగను. నీ పెళ్లి ఖర్చు నీకు ఇచ్చేస్తా అన్నాను. పెళ్లి ఎప్పుడని చెబితే అప్పుడు వస్తా అని చెప్పా. బ్యూటిఫుల్‌ లైఫ్‌.. జీవించు అని చెప్పా. అన్నీ నేను చేయలేనన్నా. ఫెంటాస్టిక్‌ డాడ్‌ అంది.


ఆర్కే: అన్ని భాషల్లో చేశారు కదా.. ఇక్కడలా రాజకీయాలున్నాయా.. అక్కడ విశాల్‌ నాన్‌లోకల్‌ కాలేదా.. మిమ్మల్నే ఎందుకంటారు?

ప్రకాశ్‌రాజ్‌: అక్కడ ఆ ఇష్యూ వచ్చింది. నన్నే అన్నారు. ఆల్వేస్‌ నేను ఔట్‌ సైడర్‌. పుట్టుకతోనే నాన్‌లోకల్‌ నేను. మా అమ్మ క్రిస్టియన్‌. మా నాన్న హిందూ. నేను హిందూ అయ్యా. మా నాన్న ఫ్యామిలీకి నేను నాన్‌‌లోకల్‌. ఆ తర్వాత కర్ణాటకలో పెద్ద స్టార్లు ఉన్న ఇండస్ర్టీ. అక్కడికి ఓ నర్సు కొడుకు రావడం అప్పుడు కూడా నాన్‌లోకల్‌. ఫ్యామిలీ ఇండస్ర్టీనే అది. 25 ఏళ్లు ఇక్కడే ఉండి అదే నినాదం వింటే బాధ కదా.


ఆర్కే: ఏడ్చారా..

ప్రకాశ్‌రాజ్‌: ఎందుకు ఏడ్వను. ఇంటికెళ్లి పడుకున్నపుడు ఉంటుంది కదా. ఇది పర్సనల్‌గా తీసుకున్నా. బాధ ఉంటుంది. నేను రాయి కాదు కదా. మనసు ఉంటుంది. భార్యకి భయముంటుంది. నేను ఒక్కడినే అంటే అది వేరు. దేనికీ సంబంధంలేని వాళ్లమీద ఎఫెక్టు ఉంటుంది కదా. ప్రశాంతంగా ఉండే వాడిని ఇంట్లో వాళ్లను హర్ట్‌ చేస్తున్నానా అనిపించింది. 


ఆర్కే: మీరు దేవుడిని నమ్మరా..

ప్రకాశ్‌రాజ్‌: నేను దేవుడిని నమ్మను. నా సమస్య ఏంటంటే దేవుడు ఉన్నాడనడానికి నమ్మితే చాలు. లేడు అనడానికి చాలా జ్ఞానం కావాలి. దానికి  టైమ్‌ లేదు. హోమం చేస్తే ఇంట్లో కూర్చుంటా. నా కొడుకు చర్చికి వెళ్దామంటే తీసుకెళ్తా. 


ఆర్కే: అహంకారం, యారగెంట్‌ అని టైటిల్స్‌ ఇచ్చారు. మరి రివేంజ్‌ ఎలా..?

ప్రకాశ్‌రాజ్‌: అదేం లేదు. గెలిచి ఉంటే వేరే రకంగా ఉండేది. కొందరితో అసోసియేషన్‌లో మాట్లాడేవాడిని. ఇప్పుడు లేను కాబట్టి సగమే చేయగలను. నన్ను నమ్మారు. మై లీడర్‌ ఈజ్‌ నాట్‌ దేర్‌ అంటుంటే బాధేస్తుంది. వాళ్లను నమ్మించాను కాబట్టి బాధ్యతగా ఉండాలి. 


ఆర్కే: ఒక్కొక్కరు 30 కోట్లు తీసుకుంటారు. ఓ ఏడాది ఆర్టిస్టులంతా 5శాతం పెడితే.. ‘మా’ బిల్డింగ్‌ పూర్తి కాదా?

ప్రకాశ్‌రాజ్‌: అది భిక్ష అవుతుంది. ఉదాహరణకి తమిళనాడులో పెప్పీ వర్కర్స్‌కి కరోనా వచ్చింది. మణిరత్నంతో నవరస అనే తొమ్మిది సినిమాలు చేశాం. నేను, సూర్య.. అందరం ఉచితంగా చేస్తే 15 కోట్లు వచ్చింది. ఫండ్‌రైజింగ్‌తో చాలా పనులు చేశాం.  


ఆర్కే: మా రిపేర్‌ అయితే మెంబర్‌ అవుతారా..

ప్రకాశ్‌రాజ్‌: విష్ణు నా రిజైన్‌ను ఒప్పుకోలేదు కదా. బాగచేస్తే మంచిదే. నేను గెలిపించడానికి పనికొస్తాను.. గెలవడానికి కాదా? నేను ఓటరును కాను. గుద్దించుకోలేదు. అందుకే బయటికొచ్చా. నాన్‌లోకల్‌ అనే పదం వాళ్లు తీసేయాలి. అప్పుడే జాయిన్‌ అవుతా.


ఆర్కే: ఈ బాధ నుంచి బయటపడి ‘మా’ని సంస్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీ మచ్‌.


కుటుంబం, కుటుంబం.. అనేవాళ్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి: ప్రకాశ్‌రాజ్(part 1)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.