ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం

ABN , First Publish Date - 2020-02-24T09:36:41+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకువచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న

ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం

  • రొమేనియా దేశానికి చెందినదే!

చీరాల టౌన్‌, ఫిబ్రవరి 23: ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకువచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్ధుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు.

Updated Date - 2020-02-24T09:36:41+05:30 IST