Abn logo
Jul 16 2020 @ 07:31AM

వైసీపీ నేత ఇంట్లో అర్ధరాత్రి వరకు కస్టమ్స్ అధికారుల సోదాలు

ప్రకాశం: ఒంగోలులో వైసీపీకి చెందిన ఓ ప్రముఖ బంగారు వ్యాపారి ఇంట్లో అర్ధరాత్రి వరకు కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిన్న ఉదయం తమిళనాడులోని ఎలావూర్ చెక్ పోస్టు వద్ద  నాలుగు కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం పట్టుబడిన వైనం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా అక్రమ బంగారం వ్యాపారం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన కారుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కర్ ఉండటంతో ఆయనకు సంబంధించిన వాహనంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి బాలినేని.. పట్టుబడిన వాహనానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కారుపై తన పేరుతో జెరాక్స్ స్టిక్కర్లు వాడారని... వాహనంలో పట్టుబడిన సొత్తుతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని మంత్రి బాలినేని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement