పీపీ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారు?

ABN , First Publish Date - 2021-03-05T08:50:50+05:30 IST

క్రిమినల్‌ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)ల పోస్టులపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక

పీపీ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారు?

 ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): క్రిమినల్‌ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)ల పోస్టులపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పోస్టుల భర్తీకి ఇంకెంతకాలం కావాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసును మరోసారి విచారించింది.


ఖాళీగా ఉన్న పీపీ పోస్టుల భర్తీతోపాటు.. ట్రయల్స్‌ కోర్టులో పీపీల కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబరులోనే స్పష్టమైన ఆదేశా లు ఇచ్చినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా చర్చలు జరుగుతున్నాయని, సమయం కావాలని ప్రభుత్వం కోరడాన్ని తప్పు పట్టింది. రాష్ట్రంలో సుమారు 570 ట్రయల్‌ కోర్టులుంటే.. అందులో సగం మంది కూ డా పీపీలు లేకపోతే.. కక్షిదారులకు ఎలా న్యాయం చేకూరుతుందని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది.


Updated Date - 2021-03-05T08:50:50+05:30 IST