ఎమ్మెల్యే శ్రీదేవికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-15T09:22:17+05:30 IST

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం లక్షణాలు కనిపించటంతో గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

ఎమ్మెల్యే శ్రీదేవికి పాజిటివ్‌

హుటాహుటిన  హైదరాబాద్‌కు


తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం లక్షణాలు కనిపించటంతో గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో మంగళవారం రాత్రి ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా సోకిన విషయం వాస్తవమేనని, అయితే ఆమె పరిస్థితి విషమించిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Updated Date - 2021-04-15T09:22:17+05:30 IST