10 కోట్ల కరోనా టీకాలను తిరిగిచ్చేసిన పేద దేశాలు.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-01-15T02:14:09+05:30 IST

డిసెంబర్ నెలలో పేద దేశాలు తమకు అందిన పది కోట్ల పైచిలుకు కరోనా టీకా డోసులను తిరస్కరించాయని ఐరాస బాలల నిధి సంస్థ(యూనీసెఫ్) తాజాగా పేర్కొంది.

10 కోట్ల కరోనా టీకాలను తిరిగిచ్చేసిన పేద దేశాలు.. కారణం ఇదే..

ఇంటర్నెట్ డెస్క్:  డిసెంబర్ నెలలో  పేద దేశాలు  తమకు అందిన పది కోట్ల పైచిలుకు కరోనా టీకా డోసులను తిరస్కరించాయని ఐరాస బాలల నిధి సంస్థ(యూనీసెఫ్) తాజాగా పేర్కొంది.  వారికి కేటాయించిన టీకాల ఎక్స్‌పైరీ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆయా దేశాలు వాటిని తిరస్కరించాయని యూనీసెఫ్ పేర్కొంది. కాగా.. ఈ పరిస్థితికి ధనిక దేశాలే కారణమని ప్రపంచం ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే స్పష్టం చేసింది. కరోనా టీకాలను పోగేసుకుంటున్నధనిక దేశాలు వాటి కాలపరిమితి తీరుపోయే ముందు టీకాలను పేద దేశాలకు విడుదల చేస్తున్నాయంటూ డబ్లూహెచ్ఓ గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పేద దేశాల్లోని జనాభాలో సగటున కేవలం 8 శాతం మంది మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఇక యూనీసెఫ్ సారథ్యంలోని కొవ్యాక్స్ వ్యవస్థ ద్వారా పేద దేశాలకు కరోనా టీకాలు ఉచితంగా అందుతున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వం విధిగా తమ వద్ద ఉన్న టీకా నిల్వల్లో కొంత శాతాన్ని కొవ్యాక్స్ వ్యవస్థకు కేటాయించాలనేది గతంలో దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

Updated Date - 2022-01-15T02:14:09+05:30 IST