తిరుపతిలో కొనసాగుతున్న పోలింగ్

ABN , First Publish Date - 2021-04-17T13:07:45+05:30 IST

పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తిరుపతిలో కొనసాగుతున్న పోలింగ్

తిరుపతి: పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక విధుల్లో మొత్తం 10,850 మంది సిబ్బందిని నియమించారు. 


ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళలు 8,38,540 మంది. పురుష ఓటర్లు 8,71,942 మంది, 216 మంది థర్డ్‌ జెండర్స్‌, 497మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. 466 సమస్యాత్మక ప్రాంతాల్లో 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 1,241 వెబ్‌ కాస్టింగ్‌ సెంటర్లు, 475మంది వీడియోగ్రాఫర్లు, 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.  10,796 మంది పోలింగ్‌ సిబ్బంది, 13,827 పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

Updated Date - 2021-04-17T13:07:45+05:30 IST