రివర్స్‌ అయిన పోలీస్‌ ‘ట్రీట్‌మెంట్‌’?

ABN , First Publish Date - 2022-08-09T05:40:56+05:30 IST

రివర్స్‌ అయిన పోలీస్‌ ‘ట్రీట్‌మెంట్‌’?

రివర్స్‌ అయిన పోలీస్‌ ‘ట్రీట్‌మెంట్‌’?

వరంగల్‌ క్రైం, ఆగస్టు 8: నగరంలో  పోలీస్‌ అధికారు లు, మద్యం వ్యాపారుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందా...? వారం రోజుల క్రితం మద్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు ప్రముఖ వ్యాపారులపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసిందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇటీవల నగరంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఉదయమే మద్యం సేవించి డ్యూటీకి వచ్చాడు. ఈ వి షయాన్ని గమనించిన సదరు అధికారి ఉదయం పూట మద్యం ఎక్కడ దొరికిందని  ప్రశ్నించడంతో నగరంలోని కొన్ని బార్లు, వైన్‌షాపుల వద్ద ఉదయమే మద్యం లభిస్తున్నట్లు సమాధానం ఇచ్చిన ట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ బాస్‌ నగరంలోని బార్‌, వైన్‌షాపు యజమానులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశం లో కొందరు మద్యం వ్యాపారులు మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బార్‌ లైసెన్స్‌లు పొందామని, నగరంలో కొన్నిచోట్ల 24గంటల పాటు బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో బార్లు నడవక నష్టపోతున్నట్లు వివరించినట్లు తెలిసింది. ముందు వాళ్లను కట్టడి చేస్తే తాము నిబంధనల మేరకు బార్లు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీ్‌సబాస్‌ సీరియస్‌ అయి, అక్కడే ఉన్న ఇన్‌స్పెక్టర్లను ఆదేశించడంతో వారు  సదరు వ్యాపారులపై చేయిచేసుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు విషయాన్ని ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేగాకుండా మద్యం వ్యాపారులు ఏకతాటిపైకి వచ్చి ఈనెల 1న పోలీస్‌ అధికారుల చర్యలను నిరసిస్తూ మద్యం షాపులను మూసివేసి నిరసన ప్రకటించారు. 

ఎక్సైజ్‌ అధికారుల సీరియస్‌..?

మద్యం షాపుల యజమానులపై వరంగల్‌ పోలీసులు అనుసరించిన తీరుపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్‌ ఆదాయానికి గండి కొట్టే వారి వైఖరిని తప్పుబట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌.. వరంగల్‌ పోలీసులతో మాట్లాడి మందలించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  మద ్యం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే నియంత్రించడానికి ఎక్సైజ్‌శాఖ ఉందని గుర్తుచేసినట్టు  సమాచారం. మందు బాబులు తాగి రోడ్లపై అమర్యాదగా ప్రవర్తించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా శాఖ పరంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పిన ట్టు తెలిసింది. తాజా పరిణామాలతో మద్యం వ్యాపారులు నెలవారీగా ఇచ్చే మామూళ్లను సైతం బంద్‌ చేసినట్టు సమాచారం.

Updated Date - 2022-08-09T05:40:56+05:30 IST