Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసుల సోదాలు

అనంతపురం: ప్రజాప్రతినిధులను దూషించిన కేసులో టీడీపీ నేతలకు చెందిన నాలుగు ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలుగు మహిళా సంఘం నేతలు స్వప్న, విజయశ్రీ, తేజస్విని, చిట్రా జానకిల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 5 సెల్‌ఫోన్లు, 3 బ్యాంక్‌ పాస్‌ బుక్కులను పోలీసులు సీజ్ చేశారు. స్వప్న ఇంట్లో 4,36,000 నగదును గుర్తించినట్లు జిల్లా పోలీస్‌ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో ఇంకా పలువురిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని జిల్లా పోలీస్‌ కార్యాలయం పేర్కొంది. 


 

Advertisement
Advertisement