Abn logo
Aug 5 2021 @ 19:18PM

హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడులు

 హైదరాబాద్: నగరంలోని మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. రోడ్ నెంబర్ 12లోని రూప సెంటర్‌పై దాడులు చేసారు. ఇద్దరు విటులను, ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వీరిని బంజారాహిల్స్ పోలీసులకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు.