అనంతపురంలో పోలీసుల ఓవరాక్షన్.. నిర్భంధంలో ఉన్న నేతలను కలవకుండా మీడియాకు ఆంక్షలు

ABN , First Publish Date - 2021-10-20T16:53:04+05:30 IST

అనంతపురం జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ తాజాగా వెలుగు చూసింది. నిర్బంధంలో ఉన్న నేతల వాయిస్ తీసుకోరాదని... వారి ఇళ్ల వద్దకు వెళ్లరాదంటూ మీడియాను పోలీసులు అడ్డుకుంటున్నారు.

అనంతపురంలో పోలీసుల ఓవరాక్షన్.. నిర్భంధంలో ఉన్న నేతలను కలవకుండా మీడియాకు ఆంక్షలు

అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ తాజాగా వెలుగు చూసింది. నిర్బంధంలో ఉన్న నేతల వాయిస్ తీసుకోరాదని... వారి ఇళ్ల వద్దకు వెళ్లరాదంటూ మీడియాను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యేతో వాయిస్ తీసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేతలతో మీడియా మాట్లాడవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మీడియాపై ఆంక్షలు విధించడంపై జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2021-10-20T16:53:04+05:30 IST