Saudi Sisters Mystery: ఆస్ట్రేలియాలో మిస్టరీగా మారిన సౌదీ అక్కాచెల్లెళ్ల ఉదంతం.. అయిదేళ్ల క్రితమే వెళ్లారు కానీ..

ABN , First Publish Date - 2022-07-29T13:40:21+05:30 IST

ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney) నగరంలో సౌదీ అరేబియాకు చెందిన అస్రా అబ్దుల్లా అల్సెహ్లీ(24), అమల్ అబ్దుల్లా అల్సెహ్లీ(23) అనే అక్కాచెల్లెళ్ల మరణం మిస్టరీ (Mystery)గా మారింది.

Saudi Sisters Mystery: ఆస్ట్రేలియాలో మిస్టరీగా మారిన సౌదీ అక్కాచెల్లెళ్ల ఉదంతం.. అయిదేళ్ల క్రితమే వెళ్లారు కానీ..

సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney) నగరంలో సౌదీ అరేబియాకు చెందిన అస్రా అబ్దుల్లా అల్సెహ్లీ(24), అమల్ అబ్దుల్లా అల్సెహ్లీ(23) అనే అక్కాచెల్లెళ్ల మరణం మిస్టరీ (Mystery)గా మారింది. వారు నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే అనుమానాస్పదస్థితిలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు విగతజీవులుగా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. గత నెల 7వ తేదీన వారి మృతదేహాలను గుర్తించినట్లు బుధవారం మీడియా సమావేశంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు(New South Wales Police) వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ అక్కాచెల్లెళ్లు ఎలా చనిపోయారనే విషయం మిస్టరీగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరు 2017లో సౌదీ అరేబియా (Saudi Arabia) నుంచి ఆస్ట్రేలియా వచ్చినట్లు వెల్లడించారు. 


జూన్ 7న వారిద్దరూ వారి అపార్ట్‌మెంట్‌లోనే అనుమానాస్పదంగా మృతిచెంది ఉన్నారన్నారు. వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. దీంతో సూసైడ్ చేసుకున్నారా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు న్యూ సౌత్ వేల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ క్లౌడియా అల్‌క్రాఫ్ట్ చెప్పారు. ఈ సిస్టర్‌కు సంబంధించి చట్టుపక్కల ఉండే వారికి ఏదైనా విషయం తెలిస్తే తమకు తెలియజేయాలని, ఈ కేసును చేధించడంలో అది కీలకం అవుతుందని తెలిపారు. ఇక ఈ ఘటనపై సిడ్నీలోని సౌదీ కాన్సులేట్ (Saudi Consulate) ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ కేసు విషయమై ఆస్ట్రేలియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ పేర్కొంది. ఈ సందర్భంగా మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.


Updated Date - 2022-07-29T13:40:21+05:30 IST