కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-10T08:41:34+05:30 IST

ప్రముఖ కవి, విమర్శకులు, కథా రచయిత, పరిశోధకులు గన్ను కృష్ణమూర్తి(70) శుక్రవారం కన్నుమూశారు.

కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత

కామారెడ్డి, సెప్టెంబరు 9: ప్రముఖ కవి, విమర్శకులు, కథా రచయిత, పరిశోధకులు గన్ను కృష్ణమూర్తి(70) శుక్రవారం కన్నుమూశారు. గత 30 ఏళ్లుగా కామారెడ్డిలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఈనెల 7న రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2022-09-10T08:41:34+05:30 IST