అంబేద్కర్ మన మధ్యే ఉన్నట్టు అనిపిస్తుంది: స్పీకర్ పోచారం

ABN , First Publish Date - 2021-04-14T17:23:06+05:30 IST

130 ఏళ్ళు గడిచిన అంబేద్కర్ మన మద్యే ఉన్నట్టు అనిపిస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

అంబేద్కర్ మన మధ్యే ఉన్నట్టు అనిపిస్తుంది: స్పీకర్ పోచారం

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  సభాపతి మాట్లాడుతూ 130 ఏళ్ళు గడిచినా.. అంబేద్కర్ మన మద్యే ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. చాలా గొప్ప రాజ్యాంగన్ని దేశానికి అందించారని కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుతుందని అంబేద్కర్ సూచించారన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి ఫలాలు అందుతున్నాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, అంబేద్కర్ స్పూర్తితో పనిచేస్తున్నామన్నారు. రాజకీయాలు అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం కాదని, ప్రజల కోసం పనిచేయ్యాలన్నారు. పార్టీలకు అతీతంగా దేశ, రాష్ట్ర ప్రగతికి పునరంకితం కావాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-14T17:23:06+05:30 IST