Abn logo
Apr 8 2020 @ 11:30AM

జీసీసీ దేశాధినేత‌ల‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్ కాల్ !

ఒమ‌న్‌: గ‌ల్ఫ్‌లో భార‌త ప్ర‌జ‌ల సంక్షేమం కోసం జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌ధాని మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా ఆయా దేశాల అధినేత‌ల‌తో మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ దేశాలు క‌రోనా బారి నుంచి ప్ర‌జ‌ల‌ను సంర‌క్షించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌లు భేష్ అని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని కొనియాడార‌ని తెలిసింది. ఒమ‌న్‌ సుల్తాన్ హైత‌మ్ బిన్ తారీఖ్‌తో కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడారు. ఇందులో భాగంగానే క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌తో పాటు నివార‌ణకు తీసుకోవాల్సిన అంశాల‌పై ఇరు దేశాల నేత‌లు చ‌ర్చించిన‌ట్లు అధికారిక వ‌ర్గాల స‌మాచారం.


అలాగే ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి భార‌త్ నుంచి జీసీసీ దేశాల‌కు ఎలాంటి స‌హాయం కావాల‌న్న తాము చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని మోదీ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు మోదీ ఫోన్ చేసినప్పుడు జీసీసీ దేశాధినేతల మధ్య వీడియో కాన్ఫరెన్స్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి, నియంత్ర‌పై ఈ కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించాల‌ని నిర్ణయించారు. 

Advertisement
Advertisement
Advertisement