కరోనా వైరస్‌ను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా అభిర్ణించిన ట్రంప్..!

ABN , First Publish Date - 2020-07-03T23:25:23+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి మండిపడ్డారు. చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్.. శ్వేత‌సౌధంలో జరిగిన ఓ కార్య

కరోనా వైరస్‌ను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా అభిర్ణించిన ట్రంప్..!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి మండిపడ్డారు. చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్.. శ్వేత‌సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చైనాపై మరోసారి కన్నెర్రజేశారు. కరోనా వైరస్‌ను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా ట్రంప్ అభివర్ణించారు. ఎప్పటికీ జరగకూడదనుకున్న దానిని చైనా.. జరిగేలా చేసిందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత ఆ సిరా తడి ఆరకముందే కరోనా వైరస్ బయటపడిందని పునరుద్ఘాటించారు. కాగా.. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోని సమాచారం ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరుకు దాదాపు 28లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 1.30లక్షల మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇదిలా ఉంటే.. జూలై మాసాన్ని ‘అమెరికా కార్మికుల నెలగా’ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం రోజు సంతకం చేశారు. 


Updated Date - 2020-07-03T23:25:23+05:30 IST