రూట్‌ని కాదు.. బ్యాట్స్‌మన్‌ని విమర్శించాలి: పీటర్సన్

ABN , First Publish Date - 2021-03-09T03:25:32+05:30 IST

టీమిండియా చేతిలో ఇంగ్లండ్ జట్టు దారుణంగా ఓటమిపాలు కావడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. ఈ ఓటమి విషయంలో జట్టు కెప్టెన్ జో్ రూట్‌ను విమర్శించాల్సిన అవసరం లేదంటూ..

రూట్‌ని కాదు.. బ్యాట్స్‌మన్‌ని విమర్శించాలి: పీటర్సన్

లండన్: టీమిండియా చేతిలో ఇంగ్లండ్ జట్టు దారుణంగా ఓటమిపాలు కావడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. ఈ ఓటమి విషయంలో జట్టు కెప్టెన్ జో్ రూట్‌ను విమర్శించాల్సిన అవసరం లేదంటూ అతడిని వెనకేసుకొచ్చాడు. తప్పు అతడికి కాదని, ప్రతి మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌లదని అన్నాడు. వారి దారుణ ప్రదర్శనల వల్లే ఇంగ్లండ్ జట్టు ఓడిపోయిందని చెప్పాడు. ‘ఇంగ్లండ్ ఓటమికి కారణం కచ్చితంగా బ్యాట్స్‌మెన్ వైఫల్యమే. అందులో కెప్టెన్ రూట్ తప్పేమీ లేదు. 


మొత్తం 4 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్‌ చాలా మంది మొత్తం సిరీస్‌లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయారు. అదే జట్టు ఓటమికి కారణమం’టూ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. ఇక జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని, ఎన్నో ఒత్తిడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూట్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పీటర్సన్ చెప్పాడు.

Updated Date - 2021-03-09T03:25:32+05:30 IST