Abn logo

పెసర పునుకులు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, మినపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం - రెండంగుళాల ముక్క, నూనె - వేగించడానికి సరిపడా. 


తయారుచేసే విధానం: పెసరపప్పు, మినప్పప్పు కలిపి 3 గంటలు నానబెట్టి నీరు వడకట్టాలి. తర్వాత పప్పుల్లో అల్లం ముక్కలు వేసి గట్టిగా పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు, ఉల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత బాగా కాగిన నూనెలో తడి చేత్తో పిండిని పునుకులుగా వేసి దోరగా వేగించాలి. వీటికి నిమ్మకాయ పచ్చడి మంచి కాంబినేషన్‌.

అలసంద వడలుక్యాబేజీ వడలుకార్న్‌ పనీర్‌ సమోసాస్వీట్ కార్న్ వడలు (వీడియో)కంద దోశలుపనీర్‌ టిక్కాఆలూ బాల్స్‌పోహా కట్‌లెట్‌ఫైబర్ ప్రోటీన్ దోశ (వీడియో)చల్ల పునుగులు (వీడియో)
Advertisement
Advertisement