హీరో ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా...

ABN , First Publish Date - 2020-10-23T15:27:17+05:30 IST

ప్రకాశం: తన అభిమాన హీరో పుట్టినరోజు అంటే చాలు.. అభిమానులు తమ పుట్టినరోజు కన్నా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి యత్నిస్తూ ఉంటారు.

హీరో ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా...

ప్రకాశం: తన అభిమాన హీరో పుట్టినరోజు అంటే చాలు.. అభిమానులు తమ పుట్టినరోజు కన్నా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి యత్నిస్తూ ఉంటారు. కేక్.. ఫ్లెక్సీలు.. రక్త దానాలు.. ఒకటేమిటి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో విషాదం చోటు చేసుకుంది. హీరో ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా... విద్యుత్‌ షాక్‌తో సుగుణారావు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో పూనూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - 2020-10-23T15:27:17+05:30 IST