విశాఖ ధర్నాచౌక్‌లో ‘ప్రజా పార్లమెంట్‌’

ABN , First Publish Date - 2021-03-23T06:03:22+05:30 IST

సిపిఐ ఎంఎల్‌ (లిబరేషన్‌) పార్టీ నేడు ఉదయం 11 నుండి 2 గంటల సమయంలో, విశాఖపట్టణం జివిఎమ్‌సి ఎదురుగా వున్న ధర్నా చౌక్‌ వద్ద...

విశాఖ ధర్నాచౌక్‌లో ‘ప్రజా పార్లమెంట్‌’

సిపిఐ ఎంఎల్‌ (లిబరేషన్‌) పార్టీ నేడు ఉదయం 11 నుండి 2 గంటల సమయంలో, విశాఖపట్టణం జివిఎమ్‌సి ఎదురుగా వున్న ధర్నా చౌక్‌ వద్ద ‘ప్రజా పార్లమెంట్‌’ నిర్వహిస్తున్నది. నేడు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌లు దేశ స్వాతంత్రం కోసం బలిదానం చేసిన రోజు. మోదీ సర్కార్‌ దేశ పబ్లిక్‌ సెక్టార్‌ను, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఎనర్జీ, అంతరిక్షం (స్పేస్‌), రక్షణ ఇలా మొత్తం అన్ని రంగాలను అమ్మకానికి పెడుతున్నది. మూడు వ్యవసాయ ‘వ్యాపార’ చట్టాలు, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నేపధ్యంలో సిపిఐ ఎంఎల్‌(లిబరేషన్‌) ఈ ప్రజా పార్లమెంట్‌ను నిర్వహిస్తున్నది. 


ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నవకిరణ్‌ నట్‌, (ట్రోలి టైమ్స్‌ సంపాదక వర్గ సభ్యులు), బ్రిజేన్‌ తివారి (భిలాయి స్టీ‌ల్‌ప్లాంట్‌ ఎఐసిసిటియు జాతీయ కమిటి సభ్యులు), సిపిఐ ఎంఎల్‌(లిబరేషన్‌) కేంద్ర కమిటి సభ్యులు ఎన్‌. మూర్తి, సిపిఐ ఎంఎల్‌(లిబరేషన్‌) ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి బి. బంగార్రావు తదితరులు పాల్గొంటారు. 

పిఎస్‌ అజయ్‌ కుమార్‌

Updated Date - 2021-03-23T06:03:22+05:30 IST