లౌకికవాద అంశాలు తొలగించొద్దు: పీడీఎస్‌యూ

ABN , First Publish Date - 2020-07-11T08:51:25+05:30 IST

కరోనా కారణంగా సీబీఎ్‌సఈ సిలబ్‌సను 30శాతం కుదించే క్రమంలో.. లౌకికవాదం, జాతీయవాదం, పౌరసత్వం, ప్రజాస్వామ్య హక్కుల ..

లౌకికవాద అంశాలు తొలగించొద్దు: పీడీఎస్‌యూ

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా సీబీఎస్‌ఈ సిలబ్‌సను 30శాతం కుదించే క్రమంలో.. లౌకికవాదం, జాతీయవాదం, పౌరసత్వం, ప్రజాస్వామ్య హక్కుల వంటి కీలక అంశాలను తొలగిస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (పీడీఎస్‌యూ) స్పష్టం చేసింది.


అలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయఖన్నాలు పేర్కొన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిని పెంచి, కీలకమైన పాఠ్యాంశాలను తొలగించకుండా చూడాలని సూచించారు. సామాజిక ఉద్యమాలను బలపరిచే పాఠ్యాంశాలను తొలగించడం హేయమైన చర్య అని విమర్శించారు.  

Updated Date - 2020-07-11T08:51:25+05:30 IST