రూ.84 కోట్లు చెల్లించండి.. పీటీఐకి నోటీసు

ABN , First Publish Date - 2020-07-14T07:53:28+05:30 IST

ఆఫీసు నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’(పీటీఐ)కి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ

రూ.84 కోట్లు చెల్లించండి.. పీటీఐకి నోటీసు

న్యూఢిల్లీ, జూలై 13: ఆఫీసు నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’(పీటీఐ)కి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఆఫీసులోని అక్రమ నిర్మాణాలను ఈ నెల 14 లోగా తొలగించాలని, లేదా ఆ లోగా రూ.84.48 కోట్లను జరిమానాగా చెల్లించి ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవాలని భూ అభివృద్ధి విభాగం ఈ నెల 7న జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది. ప్రభుత్వ జాతీయ ప్రసారసంస్థ ‘ప్రసార భారతి’తో పీటీఐకి ఇటీవల విభేదాలు తలెత్తాయి. గల్వాన్‌ లోయలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలకు భారతే కారణమని చైనా రాయబారి సున్‌ వీడాంగ్‌ ఆరోపించిన ఇంటర్వ్యూను పీటీఐ ప్రచురించడంపై ప్రసార భారతి భగ్గుమంది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ నోటీసు జారీ చేయడం గమనార్హం. 

Updated Date - 2020-07-14T07:53:28+05:30 IST