ఉక్కు ఉద్యమానికి పవన్‌ మద్దతు

ABN , First Publish Date - 2021-10-26T08:38:29+05:30 IST

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 31న

ఉక్కు ఉద్యమానికి పవన్‌ మద్దతు

31న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద సభ

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 31న విశాఖ బయలుదేరనున్నారు. పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనాలని ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు పవన్‌ ఈ నెల 31న స్టీల్‌ప్లాంట్‌ వద్ద సమితి ప్రతినిధులను కలిసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. ఈమేరకు జనసేన పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-10-26T08:38:29+05:30 IST