అమరావతి: వ్యక్తిగత అజెండాతో జనసేనని స్థాపించలేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు..వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే.. తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అంటున్నారన్నారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడి తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు. పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పీపీఏలు రద్దు చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి