విజయనగరం: ప్రజా మద్దతుతో కొత్తవలసలో టీడీపీ విజయం సాధించిదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తిరుగుబాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తామన్నారు. నియంతలకు గుణపాఠం చెప్పే విధంగా కొత్తవలస నిలబడిందన్నారు. పోలీస్, అధికార వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి తలోంచిన అధికారులు న్యాయస్థానం ముందు తలదించుకోవాలని పట్టాభిరామ్ తెలిపారు.