Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజమహేంద్రవరం జైలుకు పట్టాభి

రాజమహేంద్రవరం సిటీ/మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 22: టీడీపీ నాయకుడు పట్టాభిని శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌  జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్‌ను పరుష పదజాలంతో దూషించి గొడవలకు కారణమయ్యారనే ఆరోపణలపై పట్టాభిపై రాష్ట్ర ప్రభుత్వం 5 కేసులు నమోదు చేసింది. కోర్టు రిమాండ్‌ విధించడంతో తొలుత ఆయన్ను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం 6.40గంటలకు ఆర్మ్‌డ్‌ రిజర్వు బలగాలతో ప్రత్యేక వాహనంలో పట్టాభిని రాజమహేంద్రవరానికి తరలించారు. ఉదయం 11గంటల సమయంలో నేరుగా జైలు ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు. పట్టాభిని జైలులో రిమాండ్‌ బ్లాక్‌కు తరలించారు. 

Advertisement
Advertisement