అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారతీయ యువకుడు మృతి!

ABN , First Publish Date - 2020-08-03T21:08:07+05:30 IST

కెనడాలో 22ఏళ్ల భారత యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం, పాటియాలా జిల్లాకు చెందిన 22ఏళ్ల హ

అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారతీయ యువకుడు మృతి!

ఒట్టావా: కెనడాలో 22ఏళ్ల భారత యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం, పాటియాలా జిల్లాకు చెందిన 22ఏళ్ల హర్మిందర్ సింగ్.. 2017లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం చేసుకుంటూ.. అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో హర్మిందర్ సింగ్.. ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు కెనడా పోలీసులు.. అతని తల్లిదండ్రులకు ఆదివారం రోజు ఉదయం సమాచారం అందించారు. కొడుకు మరణ వార్త విన్న హర్మిందర్ సింగ్ తల్లిదంద్రులు.. ఒక్కసారిగా షాక్‌కు గరయ్యారు. ఈ సందర్భంగా హర్మిందర్ సింగ్ తండ్రి.. సుఖ్వీంధర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తన కొడుకు ఆత్మ చేసుకునేంత పిరికిడివాడు కాదన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలు కూడా తన కొడుకుకు లేవన్నారు. అంతేకాకుండా తన కొడుకు కేసును కెనడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి.. తమకు న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2020-08-03T21:08:07+05:30 IST