హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణతో రాష్ట్రంలోని పాస్‌పోర్టు కేంద్రం పని చేసే వేళలు, అందించే సేవల్లో పలు మార్పులు చేస్తున్నామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ప్రకటించారు. గతంలో మాదిరిగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సేవలందిస్తామని చెప్పారు. జనవరి 31 వరకు 50ు అపాయింట్‌మెంట్లు మాత్రమే ఇచ్చేలా సేవలను కుదిస్తున్నామన్నారు.