'Cute Fee' వసూలు చేసిన ఇండిగో.. క్యూట్‌గా ఉండడం నా తప్పా? అంటున్న ప్రయాణికుడు.. Twitter లో పేలుతున్న జోకులు!

ABN , First Publish Date - 2022-07-12T17:19:27+05:30 IST

ప్రైవేట్ విమానయాన సంస్థ IndiGo విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి సంబంధించిన విమాన టికెట్ తాలూకు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

'Cute Fee' వసూలు చేసిన ఇండిగో.. క్యూట్‌గా ఉండడం నా తప్పా? అంటున్న ప్రయాణికుడు.. Twitter లో పేలుతున్న జోకులు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ విమానయాన సంస్థ IndiGo విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి సంబంధించిన విమాన టికెట్ తాలూకు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ టికెట్‌లో ఇండిగో సంస్థ Cute Fee పేరిట ప్రయాణికుడి వద్ద రూ.100 వసూలు చేసింది. అయితే, ప్రయాణికుడు క్యూట్ ఫీ అర్థం తెలియక.. తాను క్యూట్‌గా ఉంటానని తెలుసు గానీ, దానికి కూడా ఫీజు వసూలు చేయాలా? అని టికెట్ తాలూకు ఫొటోతో ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ జోకులు పేలుస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. 


విమాన టికెట్ చార్జీల్లో అనేక చార్జీలు కలిపి ఉంటాయని అందరికీ తెలిసిందే. విమాన చార్జీలు, సీటు ఫీ, సెక్యూరిటీ ఫీ, డెవలప్‌మెంట్ ఫీ వంటి ఉంటాయి. కానీ, ఇటీవల ఇండిగో విమాన సంస్థ శాంతాను అనే ప్రయాణికుడికి 'క్యూట్ చార్జీ' కూడా విధించింది. దాంతో అతడు ట్విటర్‌లో విమాన టికెట్ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ఉన్న క్యూట్ పీజును ప్రస్తావిస్తూ.. "వయసుతో పాటు నాలో క్యూట్‌నెస్ కూడా పెరుగుతుందని నాకు తెలుసు. కానీ, దీనికి ఇండిగో సంస్థ చార్జీ వసూలు చేస్తుందని మాత్రం అనుకోలేదు" అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ పోస్ట్‌కు 9వేల వరకు లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు క్యూట్ చార్జీ అంటే.. క్యూట్‌గా ఉన్నందుకు విధించే చార్జీగా భావిస్తున్నారు. దీంతో దీనిపై జోకులు పేలుతున్నాయి.


'నన్ను ఎవరైనా క్యూట్‌గా ఉన్నావంటే వంద రూపాయలు చెల్లించేందుకు కూడా అస్సలు బాధపడను. సింగిల్స్ బాధ గురించి మీకేం తెలుసూ' అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. 'క్యూట్‌గా ఉన్నందుకు వసూలు చేసే చార్జీ అయితే.. నేను రూ.100 మిగుల్చుకోగలను' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ అయితే, తాను ఇండిగో విధిస్తున్న ఈ కొత్త చార్జీ కారణంగా ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించడం లేదని జోకు పేల్చారు. ఇక అదే టికెట్‌పై డెవలప్‌మెంట్ చార్జీ కూడా ఉండడంపై కూడా నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'నిన్ను వారు డెవలప్‌ చేయాలనుకుంటున్నారు. అందుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. అది నీ క్యూట్ చార్జీల కంటే 3.5రేట్లు ఎక్కువ' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. అయితే, క్యూట్ చార్జీ అంటే.. కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్‌మెంట్ చార్జీ(Cute Charge). అంటే విమానాశ్రయం టర్మినల్‌లో వాడే మెటల్ డిటెక్టర్, ఎస్కలేటర్ వంటి వాటికి వసూలు చేసే చార్జీ అన్నమాట. ఈ విషయం తెలియక శాంతాను తన విమాన టికెట్‌ను ట్వీట్ చేయడం.. దీనిపై కొందరు నెటిజన్లు నిజంగా క్యూట్‌గా ఉన్నందుకు విధించిన ఫీజుగా పొరబడడం జరిగింది. దీంతో అసలు అర్థం తెలిసిన నెటిజన్లు దీనిపై జోకులు పేలుస్తున్నారు.      




Updated Date - 2022-07-12T17:19:27+05:30 IST