బ్రెజిల్ నుంచి ముంబై వస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-03-04T07:29:31+05:30 IST

బ్రెజిల్ నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగే మహారాష్ట్ర వాసులం

బ్రెజిల్ నుంచి ముంబై వస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

ముంబై: బ్రెజిల్ నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగే మహారాష్ట్ర వాసులంతా ఇన్‌స్టిట్యూషనల్ (హోటల్) క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. వివరాల్లోకివ వెళితే.. మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర  అప్రమత్తమైంది. బ్రెజిల్, యూకే, జపాన్ తదితర ప్రాంతాల్లో కొత్త రకం కరోనా వైరస్‌లు బయటపడ్డాయి. అవి ఇండియాకు కూడా వ్యాపించాయి. కొత్త రకం కరోనా వైరస్ కొవిడ్-19 కన్నా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుదందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర వాసులను ఉద్దేశిస్తూ బీఎంసీ కీలక సర్క్యూలర్ జారీ చేసింది. బ్రెజిల్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ ఫలితాల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ వారంతా ఏడురోజుపాటు ఇన్‌స్టిట్యూషన్ క్వారెంటైన్‌లో ఉండేల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ముంబైకి వచ్చే మహారాష్ట్ర ప్రజలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని బీఎంసీ స్పష్టం చేసింది. 


Updated Date - 2021-03-04T07:29:31+05:30 IST