పరిణీతి చోప్రా ఆకుపచ్చని రహస్యం
ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST
సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే బాలీవుడ్
సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా కాస్త ముందడుగేసి తన డైట్ ప్లాన్‌లో జ్యూస్ గురించి చెప్పింది. గ్రీన్ జ్యూస్ ఇప్పుడు నాకో అడిక్షన్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. దాని పేరు గ్రీన్ జ్యూస్. బచ్చలికూర, బీట్‌రూట్, ఆరెంజ్, పుదీనతో చేసే జ్యూస్’ అని చెప్పుకొచ్చింది. మూడ్‌ను బట్టి ఈ ఆకుపచ్చని రసంలోకి నిమ్మరసం కలుపుతుందట పరిణీతి చోప్రా.
ఆరోగ్యానికి మంచిదే
ఈ జ్యూస్‌తో రక్తహీనత సమస్య రాదు. ఆరెంజ్, నిమ్మ వల్ల విటమిన్-సి తో పాటు ఐరన్ లభిస్తుంది. బీట్‌రూట్ వల్ల హైబీపీ రాదు. ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కడుపులో మంట తగ్గుతుంది. చర్మసౌందర్యానికి కూడా ఈ జ్యూస్ మంచిదే. మొత్తానికి పరిణీతి చోప్రా గత మార్చి నుంచి టర్కీలో ఉంటోంది. అక్కడ సముద్రం ఒడ్డులో సేదతీరుతున్న ఫొటోలు, పూలతోటలో తిరగాడుతూ, జిమ్ వీడియోలతో పాటు ఇలా తన ఆహార విశేషాలను ఇలా ఇన్‌స్టాలో పంచుకుంటోంది.