Viral Video: బౌలింగ్ వేస్తుంటే అటువైపు పంత్ చేసిన పని ఇదీ!

ABN , First Publish Date - 2021-08-29T01:10:14+05:30 IST

వికెట్ల వెనక నుంచి ఫన్నీ కామెంట్లు చేసే సహచరులను ఉత్సాహపరిచే టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్

Viral Video: బౌలింగ్ వేస్తుంటే అటువైపు పంత్ చేసిన పని ఇదీ!

లీడ్స్: వికెట్ల వెనక నుంచి ఫన్నీ కామెంట్లు చేసి సహచరులను ఉత్సాహపరిచే టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తాజాగా మరోమారు వార్తల్లోకిఎక్కాడు. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు (శనివారం) బ్యాటింగ్‌కు దిగిన పంత్ వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరాడు.


అయితే, అంతకుముందు పంత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో షాడో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజింక్య రహానే బ్యాటింగ్‌కు సిద్ధం కాగా, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌కు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అదేమీ పట్టించుకోని పంత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ (షాడో బ్యాటింగ్) చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అండర్సన్ క్రీజులోకి వచ్చాక చూసుకున్న పంత్ అప్పటికప్పుడు అప్రమత్తమయ్యాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసీ రహానే క్రీజు నుంచి ఎందుకు పక్కకి తప్పుకోలేదని ప్రశ్నిస్తున్నారు.  



పంత్ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు. రెండుసార్లూ రాబిన్‌సన్‌కే దొరికిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనతోపాటు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో చెలరేగిన పంత్‌కు ఈ సిరీస్ మాత్రం కఠినంగానే ఉంది. పంత్ ఐదు ఇన్నింగ్స్‌లలో 87 పరుగులు మాత్రమే చేశాడు.  



Updated Date - 2021-08-29T01:10:14+05:30 IST