Abn logo

పనీర్‌ దమ్‌ రోల్‌

కావలసినవి: పనీర్‌ - ఒకకేజీ, క్యాబేజీ - ఒక కేజీ, పచ్చి బఠాణీ - 100గ్రా, కారం - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, కశ్మీరీ కారం - 30గ్రా, పచ్చిమిర్చి - 50గ్రా, నూనె - 200గ్రా, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ - 100గ్రా, రవ్వ - 100గ్రా, జున్ను - 250గ్రా, నెయ్యి - 150గ్రాములు.


తయారీ విధానం: పనీర్‌ని వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, బఠాణీ వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత తరిగిన క్యాబేజీ వేయాలి. నీరు ఇగిరిపోయేంత వరకు చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు కారం, రవ్వ, కశ్మీరీ కారం వేసి మరికాసేపు వేగించుకుని దింపాలి. మిశ్రమం చల్లారిన తరువాత జున్ను వేసి కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనీర్‌ మధ్యలో పెట్టి రోల్‌ చేసి ఫ్రిజ్‌లో గంటపాటు పెట్టుకోవాలి. తరువాత బయటకు తీసి బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రోల్స్‌ను అన్ని వైపులా కాల్చాలి. చివరగా ధనియాల పొడి చల్లుకుని వేడి వేడిగా వడ్డించాలి.


పనీర్‌లో...

క్యాలరీలు 293

ఫ్యాటీ 25గ్రా

ప్రొటీన్‌ 14గ్రా

కార్బోహైడ్రేట్లు 2.97గ్రా


కొత్తిమీర వడలుఓట్స్‌ చిల్లాపొట్టిక్కలుమొలకల వడపండుమిర్చి - చికెన్‌ ఫ్రైపండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌పాలకూర - కొత్తిమీర దోశసోయా దోశపనసపండు దోశసేమ్యా ఉప్మా
Advertisement
Advertisement