నెల్లూరు: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ సెక్రటరీ పట్టుబడ్డారు. జిల్లాలోని ఏఎస్ పేట (మ) కావలి ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ కృష్ణ మాధురి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమణయ్య అనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.4వేలు లంచం తీసుకుంటుండగా కృష్ణ మాధురిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్ట్రీట్ లైట్స్ రీప్లేస్‌మెంట్ బిల్లు ఫైలు ప్రాసెస్ కోసం కృష్ణ మాధురి లంచం రూపంలో డబ్బు డిమాండ్ చేశారు.