ఉక్కు ప్రైవేటీకరణలో జగనే తొలి ముద్దాయి

ABN , First Publish Date - 2021-02-28T08:25:56+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పోస్కోతో జరిగిన చీకటి ఒప్పందంలో ప్రథమ ముద్దాయి, దోషి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డేనని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. శనివారం

ఉక్కు ప్రైవేటీకరణలో జగనే తొలి ముద్దాయి

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆరోపణ

5న బంద్‌కు టీడీపీ మద్దతు: పల్లా


మహారాణిపేట (విశాఖపట్నం), ఫిబ్రవరి 27: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పోస్కోతో జరిగిన చీకటి ఒప్పందంలో ప్రథమ ముద్దాయి, దోషి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డేనని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతోమాట్లాడుతూ ముఖ్యమంత్రికి తెలిసే ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధాన ఘట్టానికి ముందు, వెనుక ముఖ్యమంత్రి జగన్‌, విజయసాయిరెడ్డిలతో పోస్కో ప్రతినిధులు సమావేశమయ్యారని పట్టాభి ఆరోపించారు. ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఏడాది కిందటే ముఖ్యమంత్రికి సమాచారం తెలిసినా ప్రజలకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. 


విశాఖ ఉక్కు కర్మాగారానికి కుక్కునూరులో గనులు కేటాయించేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా శ్రమించారని తెలిపారు. కుక్కునూరు గనుల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో ఎందుకు ప్రస్తావించలేదని పట్టాభి ప్రశ్నించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి, సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో అత్యవసర తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల ఐదో తేదీన బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని చెప్పారు.

Updated Date - 2021-02-28T08:25:56+05:30 IST