హిందూత్వాన్ని అడ్డం పెట్టుకోను.. పీసీబీపైనే నా కోపం: డానిష్ కనేరియా

ABN , First Publish Date - 2020-08-09T01:46:15+05:30 IST

ఫిక్సింగ్ నేపథ్యంలో పాకీస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే దీనికి అతడు హిందువు...

హిందూత్వాన్ని అడ్డం పెట్టుకోను.. పీసీబీపైనే నా కోపం: డానిష్ కనేరియా

ఇస్లామాబాద్: ఫిక్సింగ్ నేపథ్యంలో పాకీస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే దీనికి అతడు హిందువు కావడమేనని అప్పటి నుంచి కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై కనేరియా ఎట్టకేలకు స్పందించాడు. తాను హిందువు కావడం వల్లనే పీసీబీ తనపై నిషేధం విధించిందని చెప్పనని, కేవలం పీసీబీ విధానంపై మాత్రమే తన ఆగ్రహం అని పేర్కొన్నాడు. ‘పాకీస్తాన్ రెండు నాల్కల ధోరణిపైనే నా కోపం. ఆమిర్, ఆసిఫ్, సల్మాన్, ఉమర్.. ఇలా అనేకమంది ఆటగాళ్లు కూడా స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికిపోయారు. కానీ వారికి మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం పీసీబీ కల్పించింది. కానీ నా విషయంలో మాత్రం దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. నన్ను కావాలనే తొక్కేస్తోంద’ని కనేరియా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే 2009లో జరిగిన ఓ మ్యాచ్‌లో డానిష్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పీసీబీ కనేరియాపై నిషేధం విధించింది. అయితే అప్పటి నుంచి ఆరేళ్లపాటు తాను ఫిక్సింగ్‌కు పాల్పడలేదంటూ కనేరియా చెప్పుకొచ్చాడు. కానీ ఎట్టకేలకు 2018లో తనపై ఉన్న స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలను అంగీకరించాడు.

Updated Date - 2020-08-09T01:46:15+05:30 IST