కేసులు పెరుగుతోంటే.. పరీక్షల సంఖ్య తగ్గుతోంది.. పాక్‌లో..

ABN , First Publish Date - 2020-07-09T03:41:26+05:30 IST

పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 2,980 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కేసులు పెరుగుతోంటే.. పరీక్షల సంఖ్య తగ్గుతోంది.. పాక్‌లో..

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 2,980 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,37,489కు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధిక కరోనా కేసులు సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లలోనే నమోదయ్యాయి. సింధ్‌ ప్రావిన్స్‌లో 97,626 కరోనా కేసులు నమోదు కాగా.. పంజాబ్ ప్రావిన్స్‌లో  83,559 కేసులు బయటపడ్డాయి. వీటితో పాటు బలూచిస్థాన్‌లో 10,919 కేసులు, ఇస్లామాబాద్‌లో 13,650 కేసులు, నమోదయ్యాయి. మరోపక్క గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో కరోనా కారణంగా 83 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,922కు చేరింది. కాగా.. దేశంలో ఒకపక్క కరోనా కేసులు పెరుగుతూ వెళ్తోంటే.. కరోనా పరీక్షల సంఖ్య మాత్రం తగ్గుతూ పోతోంది. ముఖ్యంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లలో కరోనా పరీక్షలు చేయడం చాలా వరకు తగ్గించేసినట్టు తెలుస్తోంది. సింధ్ ప్రావిన్స్‌లో నిత్యం 9,317 పరీక్షలు చేస్తోంటే.. పంజాబ్ ప్రావిన్స్‌లో 7,659 పరీక్షలు మాత్రమే అధికారులు నిర్వహిస్తున్నారు. గత 18 రోజుల నుంచి నిత్యం కరోనా పరీక్షల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.

Updated Date - 2020-07-09T03:41:26+05:30 IST