Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాజిద్‌ సిక్సర్‌.. బంగ్లా 76/7

ఢాకా: పాకిస్థాన్‌ ఆఫ్‌స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాలు (6/35) నమోదు చేయడంతో బంగ్లాదేశ్‌ ఫాలోఆన్‌ ముంగిట నిలిచింది. మూడో రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా.. మంగళవారం పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 98.3 ఓవర్లలో 300/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అజర్‌ అలీ (56), బాబర్‌ ఆజమ్‌ (76), ఫవాద్‌ ఆలమ్‌ (50 నాటౌట్‌), రిజ్వాన్‌ (53 నాటౌట్‌) అర్ధసెంచరీలు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాను సాజిద్‌ వణికించాడు. దీంతో 26 ఓవర్లలో 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో షకీబ్‌ (23 బ్యాటింగ్‌), తైజుల్‌ (0 బ్యాటింగ్‌) ఉన్నారు. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే బంగ్లా మరో 25 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మూడు వికెట్లున్నాయి.

Advertisement
Advertisement