Abn logo
Aug 2 2020 @ 14:48PM

ప్రతి దేశానికి డబ్బులు కావాలి.. అందుకే ఐపీఎల్ కూడా: పాక్ మాజీ కెప్టెన్

ఇస్లామాబాద్: ఐపీఎల్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వచ్చే నెల నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టింది. అయితే ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి పలువురు పాక్ క్రికెటర్లు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. బీసీసీఐ ధన బలంతోనే ఇది సాధించిందని ఆరోపిస్తున్నారు. కానీ పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించారు. ప్రతి దేశానికి డబ్బు అవసరం అని, ముఖ్యంగా టీ20 టోర్నీల ద్వారా ఆయా దేశాలకు భారీగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘ క్రికెట్ బోర్డులు టీ20 టోర్నీలు ఆడటానికి ఆసక్తి చూపుతాయి, వీటి ద్వారా ఆయా దేశాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. అంత లాభాన్ని ఎవరూ వద్దనుకోరు. అందువల్లే ఆయా దేశాలు ఈ టోర్నీల నిర్వాహణపై ఎక్కువగా మక్కువ చూపుతాయ’ని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement