పాక్‌దే వన్డే సిరీస్‌

ABN , First Publish Date - 2022-04-03T09:43:44+05:30 IST

ఆస్ట్రేలియాతో ఆఖరిదైన మూడో వన్డేలో పాకిస్థాన్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య పాక్‌ 2-1తో దక్కించుకుంది

పాక్‌దే వన్డే సిరీస్‌

లాహోర్‌: ఆస్ట్రేలియాతో ఆఖరిదైన మూడో వన్డేలో పాకిస్థాన్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య పాక్‌ 2-1తో దక్కించుకుంది. తొలి మ్యాచ్‌ను ఆసీస్‌ నెగ్గగా, రెండో మ్యాచ్‌ను పాక్‌ సొంతం చేసుకుంది. ఇక, శనివారం జరిగిన చివరి వన్డేలో మొదట ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్‌ క్యారీ (56) అర్ధ సెంచరీ సాధించాడు. సీన్‌ అబాట్‌ 49 పరుగులు చేశాడు. పాక్‌ బౌలర్లు హారిస్‌ రౌఫ్‌ (3/39), మహ్మద్‌ వాసిమ్‌ (3/40) చెరి మూడు వికెట్లు తీశారు. ఛేదనలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (105 నాటౌట్‌) అజేయ సెంచరీకి తోడు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (89 నాటౌట్‌) రాణించడంతో పాక్‌ 37.5 ఓవర్లలో వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి గెలిచింది. 

Updated Date - 2022-04-03T09:43:44+05:30 IST