అదరగొట్టిన పేజ్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ గరిష్టానికి స్టాక్..

ABN , First Publish Date - 2022-08-12T20:13:23+05:30 IST

ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో గత ఏడాదిలో పోలిస్తే

అదరగొట్టిన పేజ్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ గరిష్టానికి స్టాక్..

Page Industries Shares : ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో గత ఏడాదిలో పోలిస్తే ఎన్నో రెట్ల లాభాన్ని ఆర్జించింది. దీంతో నేడు కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు సరికొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ బీఎస్‌ఈ(BSE)లో క్రితం ముగింపు రూ.49,122.05 నుంచి 2.09 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.50,146.4కి చేరుకున్నాయి.  


లార్జ్ క్యాప్ స్టాక్(Large Cap Stock) 5-రోజులు, 20-రోజులు, 50-రోజులు, 100-రోజులు, 200-రోజుల మూవింగ్ యావరేజ్‌లను మించి ట్రేడవుతోంది. ఈ రోజు కంపెనీ షేరు రూ.49,799.5 వద్ద లాభపడింది. షేరు ఒక సంవత్సరంలో 53.5 శాతం లాభపడింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 23.22 శాతం పెరిగింది. సంస్థ మొత్తం 467 షేర్లు బీఎస్‌ఈలో రూ. 2.31 కోట్ల టర్నోవర్‌కు మారాయి. 


కంపెనీ మార్కెట్ క్యాప్(M Cap) రూ.55,435 కోట్లకు పెరిగింది. జూన్ 30, 2021న షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.29,965కి చేరుకుంది. ఈ దుస్తుల తయారీ కంపెనీ ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 10.94 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 207.03 కోట్లకు పెరిగింది.




Updated Date - 2022-08-12T20:13:23+05:30 IST