చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌

ABN , First Publish Date - 2022-01-26T06:49:37+05:30 IST

టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించింది. భారత పారిశ్రామిక రంగానికి అందిస్తున్న విశేష సేవలకు గాను ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం దక్కింది. ...

చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌

  టాటా గ్రూప్‌ సారథికి ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించింది. భారత పారిశ్రామిక రంగానికి అందిస్తున్న విశేష సేవలకు గాను ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం దక్కింది. ఉన్నత విద్య పూర్తి చేసుకున్నాక 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌)తో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖరన్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో అదే కంపెనీకి సీఈఓగా నియమితులయ్యారు. 2017లో ఆయనకు టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. టాటా గ్రూప్‌న కు సారథ్యం వహిస్తున్న తొలి పార్శీయేతర వ్యక్తి ఈయనే. వ్యాపార రంగంలో చంద్రశేఖరన్‌కు గతంలోనూ పలు పురస్కారాలు, గుర్తింపులు లభించాయి. ప్రస్తుతం ఆయన భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్‌గానూ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది పారిశ్రామిక రంగం నుంచి మొత్తం తొమ్మిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, తెలుగువ్యక్తి, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్‌ సారథి సుందర్‌ పిచాయ్‌కి సైతం పద్మ భూషణ్‌ దక్కింది. లోదుస్తుల తయారీ కంపెనీ రూపా అండ్‌ కంపెనీ చైర్మన్‌ ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాలా, ఛండీగఢ్‌కు చెందిన చర్దిక్లా మీడియా గ్రూప్‌ చైర్మన్‌ జగ్జీత్‌ సింగ్‌ దర్దీ, మణిపూర్‌కు చెందిన ఉన్ని పాదరక్షల తయారీ కళాకారిణి ముక్తమణి దేవీ, జపాన్‌కు చెందిన ర్యుకో హిరాకు పద్మశ్రీ అవార్డు లభించింది. 

Updated Date - 2022-01-26T06:49:37+05:30 IST