నాన్నకు చికిత్స ఆ డబ్బుతోనే..

ABN , First Publish Date - 2021-05-08T09:19:20+05:30 IST

వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆడి తొలి ఐపీఎల్‌లోనే ఆకట్టుకున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ ఎడమ చేతి మీడియం పేసర్‌ చేతన్‌ సకారియా.

నాన్నకు చికిత్స ఆ డబ్బుతోనే..

భావ్‌నగర్‌: వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆడి తొలి ఐపీఎల్‌లోనే ఆకట్టుకున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ ఎడమ చేతి మీడియం పేసర్‌ చేతన్‌ సకారియా. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల సకారియాను వేలంలో రాజస్థాన్‌ జట్టు రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డబ్బే ప్రస్తుత కీలక తరుణంలో తనకు ఎంతో ఉపయోగపడుతున్నదని చేతన్‌ వెల్లడించాడు.


లీగ్‌ ప్రారంభానికి ముందు కొవిడ్‌తో సోదరుడిని కోల్పోయాడు చేతన్‌. అనంతరం సకారియా తండ్రికి కూడా కరోనా సోకింది. దాంతో భావ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. ఐపీఎల్‌ వాయిదా పడడంతో సకారియా ప్రస్తుతం ఆసుపత్రిలో తండ్రి బాగోగులు చూసుకుంటున్నాడు. ‘ఐపీఎల్‌ ఆపాలని కొందరు అన్నారు. కానీ వారికి ఒకటే చెప్పదలచుకున్నా. నా కుటుంబంలో నేను ఒక్కడినే సంపాదించేవాడిని. క్రికెట్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నా. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆ డబ్బే నా తండ్రి చికిత్సకు ఉపయోగడపడుతున్నది’ అని చేతన్‌ వివరించాడు. 

Updated Date - 2021-05-08T09:19:20+05:30 IST