49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-05-08T09:09:52+05:30 IST

రాష్ట్రంలోని 49 ఆస్పత్రుల్లో రూ.309 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ ప్లాంట్లు(పీఎ్‌సఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు

49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

309 కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం: సింఘాల్‌


అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 49 ఆస్పత్రుల్లో రూ.309 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ ప్లాంట్లు(పీఎ్‌సఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.180 కోట్లతో ప్లాంట్లు, సివిల్‌ వర్కులకు రూ.25 కోట్లు, పది వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల కోసం రూ.50 కోట్లు, 50 క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. 25 క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. దీనికోసం రూ.46 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు.  


జిల్లాకో అత్యాధునిక డయాగ్నొస్టిక్‌ కేంద్రం 

రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కేంద్ర మాజీమంత్రి సురేశ్‌ ప్రభు ఇప్పుడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే 13 జిల్లాలకూ 13 అత్యాధునిక క్రిటిక ల్‌ కేర్‌ అంబులెన్స్‌లను ఆయన అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ సీటీ స్కాన్‌తో సహా అత్యాధునిక డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయించినట్లు కలెక్టర్లకు ఆయన తాజాగా లేఖ రాశారు. ఈ కేంద్రంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించే సదుపాయం కూడా ఉంటుందని వెల్లడించారు.  

Updated Date - 2021-05-08T09:09:52+05:30 IST