Osmania Hospitalకి జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు నిందితుడు

ABN , First Publish Date - 2022-06-11T16:35:06+05:30 IST

జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దదీన్ మాలిక్‌ను శనివారం ఉదయం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Osmania Hospitalకి జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు నిందితుడు

హైదారాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దదీన్ మాలిక్‌ను శనివారం ఉదయం  పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడికి ఉస్మానియా ఆస్పత్రిలో పొటెన్సీ పరీక్ష చేయనున్నారు. రేప్ కేసు ఛార్జిషీట్ ధాఖలులో లైంగిక పటుత్వ పరీక్ష తప్పనిసరని పోలీసులు భావిస్తున్నారు. 


మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులు సైదాబాద్ జువైనల్ హోంకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఓ ఎస్కార్ట్, రెండు ఫోర్స్ పోలీస్ వాహనాలను అధికారులు సిద్దం చేశారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు విచారించనున్నారు. 

Updated Date - 2022-06-11T16:35:06+05:30 IST