అమెరికాలో టిక్ టాక్... రంగంలోకి ఒరాకిల్

ABN , First Publish Date - 2020-09-15T22:09:44+05:30 IST

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలలో తాము భాగస్వాములం కాదల్చుకుంటామంటూ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్ ను తాము పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. ఒరాకిల్ నుంచి తమకు ఈ మేరకు ఓ ప్రతిపాదన అందిందని ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనను టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ తోసిపుచ్చిందన్నారు. అటు-తాము ఓ ప్రతిపాదనను ట్రెజరీ శాఖకు అందించామని, అమెరికా భద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలకూ పాల్పడబోమని హామీనిచ్చామని టిక్ టాక్ సంస్థ కూడా వెల్లడించింది.

అమెరికాలో టిక్ టాక్... రంగంలోకి ఒరాకిల్

డెట్రాయిట్ : అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలలో తాము భాగస్వాములం కాదల్చుకుంటామంటూ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్ ను తాము పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు.


ఒరాకిల్ నుంచి తమకు ఈ మేరకు ఓ ప్రతిపాదన అందిందని ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనను టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ తోసిపుచ్చిందన్నారు. అటు-తాము ఓ ప్రతిపాదనను ట్రెజరీ శాఖకు అందించామని, అమెరికా భద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలకూ పాల్పడబోమని హామీనిచ్చామని టిక్ టాక్ సంస్థ కూడా వెల్లడించింది.


అయితే ‘ఈ అభ్యర్థనను, ఒరాకిల్ ప్రతిపాదనను ప్రభుత్వ కమిటీకి నివేదించాం. జాతీయ భద్రతా వ్యవహారాలను, విదేశీ లావాదేవీలను పర్యవేక్షించే ఆ కమిటీయే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని స్టీవెన్ నుచిన్ చెప్పారు.


అమెరికాలో టిక్ టాక్ అంటే అమితంగా అభిమానించే యువత 60 శాతానికి పైగా ఉన్న విషయం తెలిసిందే. మొదట... మైక్రోసాఫ్ట్ తాము ఈ దేశంలో ఈ చైనీస్ యాప్ ఆపరేషన్స్‌ను చేపడతామని ముందుకు రాగా... ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపధ్య్మలో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-09-15T22:09:44+05:30 IST