ఒరాకిల్ ఇండియా అధినేతపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-06-15T21:25:12+05:30 IST

ఒరాకిల్ ఇండియా అధినేతకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకటనల పేరుతో డబ్బులు దండుకుంటున్నారంటూ ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్

ఒరాకిల్ ఇండియా అధినేతపై కేసు నమోదు

హైదరాబాద్: ఒరాకిల్ ఇండియా అధినేతకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకటనల పేరుతో డబ్బులు దండుకుంటున్నారంటూ ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్ దంపతులపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వెబ్ సైట్స్‌లో యాడ్స్ చూపించి ప్రాజెక్టుల పేరుతో ప్రదీప్ అగర్వాల్, అతని భార్య మీరూ అగర్వాల్ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్స్ చేయాలని క్లయింట్ల‌పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అంతేగాక పేమెంటు చేయని క్లయింట్లపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అతని భార్య మీరూ అగర్వాల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు. ఎంఏడీఎస్(MADS) క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ సైట్‌లు ప్రారంభించి లేని ప్రాజెక్ట్ పేరుతో క్లయింట్‌లకు అగర్వాల్ దంపతులు ఎర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రదీప్ అగర్వాల్‌పై రెండు సెక్షన్ల కింద కేస్ నమోదు చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నెల 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటిసులు జారీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-15T21:25:12+05:30 IST