కొడాలి నానిని బర్తరఫ్‌ చేయండి

ABN , First Publish Date - 2022-01-25T08:58:29+05:30 IST

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు.

కొడాలి నానిని బర్తరఫ్‌ చేయండి

లేదంటే చలో గుడివాడ నిర్వహిస్తాం: అనిత

మహారాణిపేట (విశాఖపట్నం), జనవరి 24: కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘చలో గుడివాడ’ కార్యక్రమం చేపడతామని, అక్కడ జరిగిన వ్యవహారాలతో సంబంధం ఉన్నవారి బయటపెడతామని హెచ్చరించారు. కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లోనే కేసినో జరిగిందని దేశం మొత్తం చూసిందన్నారు. తక్షణమే మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్‌ చేయాలన్నారు. లేకపోతే తొలుత గుడివాడ, తరువాత తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు. 

Updated Date - 2022-01-25T08:58:29+05:30 IST